Search
Close this search box.

Business Ideas For All

Facebook
WhatsApp
Telegram

సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే చాలామంది డబ్బును పోగు చేసుకున్న తర్వాత వాళ్ళు చేసే పని ఏంటి అంటే గ్యారెంటీగా సక్సెస్ అయ్యే business ideas ఉందా అని ఆలోచిస్తారు.!?. చాలా కష్టపడే డబ్బులు పోగు చేసుకుంటారు.

ఎక్కడెక్కడ నుంచో అప్పు తెస్తారు. సేవింగ్స్ నుంచి కూడా మనీని తీసుకుంటారు. ఇంత కష్టపడి వాళ్ళు రిస్క్ తక్కువ ఉన్న బిజినెస్ ఏదైనా ఉందా!?.ఇలా అందరి దగ్గరికి వెళ్లి అడగడం మొదలు పెడతారు.ఇప్పుడు అందరి దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి అంటే అదేంటి రిస్క్ లేకుండా బిజినెస్ ఉంటుందా..!?.

బిజినెస్ అంటేనే రిస్క్ కదా ఎంతో కొంత రిస్క్ చేయాల్సి ఉంటుంది బిజినెస్ లో అని చెప్తూ ఉంటారు.వాళ్ళు చెప్తుంది అంత లాజికల్.కానీ అంత కష్టపడి డబ్బులు పోవు చేసుకొని ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరూ రిస్క్ లేని బిజినెస్ ఐడియాస్ కావాలి అని అనుకుంటారు.మీరు కూడా ఇదే situation లో ఉంటే ఈ ఆర్టికల్ మీకు చాలా యూస్ ఫుల్ గా ఉంటుంది.

Business Ideas – Strategy:

ఈరోజు మనం రిస్క్ చాలా తక్కువ ఉన్నా బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం. బిజినెస్ అంటేనే కొంచెం risk ఉంటుంది. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియాల్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.సక్సెస్ అవడానికి బోలెడన్ని అవకాశాలు ఉంటాయి.

ఖచ్చితంగా ఒక బిజినెస్ సక్సెస్ అవుతుంది అనే నాలెడ్జ్ మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి?ఎలా అంటే చాలా చాలా సింపుల్. ఎలా అంటే మనకు ఆ బిజినెస్ లో పూర్వ అనుభవం ఉండాలి.ఆ బిజినెస్ లో మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ బిజినెస్ లో ఉన్న లోటు పాట్లు మరియు ప్రాఫిట్స్ ఏంటో మనకన్నీ పూర్తిగా తెలుస్తాయి.

You can Also Read This:

Record Writing Work – Click Here

Typing Work – Click Here

Business Ideas – Example 1:

ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు.అసలు అనుభవం లేదు.అనుభవం లేని బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది స్టాఫ్ కావాలి? ఎన్ని సేల్స్ అవుతాయి?లాభం ఎంత వస్తుంది?నష్టం జరిగే అవకాశం ఎంత ఉంది?వీటి అన్నిటి గురించి మనకు అస్సలు తెలీదు.ఇవన్నీ తెలియాలి అంటే అదే వ్యాపారం చేస్తున్న వ్యక్తి దగ్గర మనం పని చేసి ఉండాలి.

అలా అదే వ్యాపారం చేస్తున్న వ్యక్తి దగ్గర మనం పనిచేసి ఉన్నట్లయితే ఆ బిజినెస్ లో మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది?ఎంత లాస్ వస్తుంది?ఎన్ని సేల్స్ జరుగుతాయి?ఎంతమంది స్టాఫ్ కావాలి?అనే విషయాలన్నీ క్లియర్గా తెలుస్తాయి.కొంచెం కూడా ఆలోచించకుండా పలానా బిజినెస్ బాగుంటుంది అంట అని ఎవరో చెప్పారు అనే సింపుల్గా మనం ఆ బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లయితే అందులో ఎలా ఉంటుందో మనకు తెలియదు సో మనం దాదాపుగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఒక మంచి మార్గంలో మీరు వెళ్లాలంటే ఏం చేయాలో Business Ideas మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇప్పుడు నేను మీకు కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్తాను.వాటి గురించి ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం.ఈ ఐడియాస్ అన్నిట్లో మనకు కనిపించేది ఏంటి అంటే పూర్వ అనుభవం ఉండి తీరాలి.

అలా పూర్వా అనుభవం ఉండడం వల్ల ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది?ఎన్ని sales జరుగుతాయి?ఎంతమంది స్టాఫ్ కావాలి?అలాగే ఎంత ప్రాఫిట్ వస్తుంది?ఎంత లాస్ వస్తుంది?దాని ఎలా కవర్ చేయాలి? అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది.

ఉదాహరణ ఒక డయాగ్నస్టిక్ సెంటర్ ఉంది.మనకు నార్మల్గా ఎక్స్రేలు మరియు బ్లడ్ టెస్ట్ లు చేసే ఒక డయాగ్నస్టిక్ సెంటర్ ఉంది.ఈ డయాగ్నటిక్ సెంటర్లో రాదా అని ఒక అమ్మాయి receptionist గా పని చేస్తుంది.కాల్స్ వస్తూ ఉంటాయి.కస్టమర్స్ అందరూ ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు.

అలాగే వచ్చిన కస్టమర్స్ అందరితో నవ్వుతూ మాట్లాడుకునే ఒక జాబ్.అయితే ఇలా receptionist గా పనిచేస్తున్న అమ్మాయి దగ్గరికి దాదాపుగా రోజుకి 20 ఎంక్వయిరీ ల వరకు వస్తాయి.వాళ్ళ డయాగ్నటిక్స్ center డీటెయిల్స్ అన్ని గూగుల్లో చూసినప్పుడు నంబర్ ఉంటుంది కదా. ఆ నెంబర్ కి నెంబర్ ఆఫ్ కాల్స్ ఎంక్వైరీ కోసం వస్తాయి.ఎంక్వయిరీస్ అంటే ఫోన్ చేసి మీ దగ్గర బ్లడ్ టెస్ట్ ఉందా? మీ దగ్గర ఈ బాడీ స్కాన్ చేస్తారా? అని క్యూస్షన్స్ అని అడుగుతూ ఉంటారు.ఆ అమ్మాయికి రోజుకి 20 ఎంక్వయిరీలు వస్తాయి కదా ఆ 20 ఇంక్వైరీలో 3 queries కి చెప్పే సమాధానం ఏంటి అంటే..

ఈ స్కాన్ మా దగ్గర లేదండి.మీరు స్కాన్ చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తారు.ఇక్కడ ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది.ఎలా అంటే..అంటే ఇలా enquiries వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర లేని స్కాన్ ఆర్ టెస్ట్ గురించి వాళ్లు… వేరే వాళ్ల గురించి చెప్పి అక్కడికి మరలిస్తారు, లైక్ హైదరాబాద్ లో ఉంటుంది.

వైజాగ్ లో ఉంటుంది వెళ్ళండి అని. ఇక్కడ మనం చూసినట్లయితే test ఉంటది చూసారా అది DEXA అన్నమాట.ఈ DEXA అనే స్కాను వాళ్ళ ఊర్లో లేదు.కాబట్టి వారు వేరే ఊరు వెళ్లాల్సి ఉంటుంది.

ప్రతిరోజు DEXA స్కాన్ కోసం ఫోన్ చేసి అడిగినప్పుడు diagnostics సెంటర్ వాళ్ళు ఇది హైదరాబాద్ లో అవైలబుల్ గా ఉంది. వైజాగ్ లో అవైలబుల్ గా ఉంది. అక్కడికి వెళ్ళండి అని చెప్తారు.ఇది కాకపోతే వేరే టెస్ట్ లే అని అనుకోవడానికి లేదు .ఎందుకంటే డాక్టర్లు ఏ టెస్ట్ అయితే చేయించుకోండి అని రాసిస్తారో అదే మనం చేయించుకోవాలి.టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ తెచ్చి డాక్టర్ కి ఇవ్వాలి.

సో ఆమె ఎలా థింగ్ చేసింది అంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసి DEXA స్కాన్ తీసుకున్నట్లయితే ఇలా కాల్స్ ని మళ్లించాల్సి వస్తుంది కదా ఆ కాల్స్ అని నేనే తీసుకొని నేనే టెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆలోచించింది.

మిషన్ కాస్ట్ ఎంత ఉంటుందని గూగుల్లో చూస్తే 30 లక్షలు చూపించింది. ఈ అమ్మాయి పెద్దగా నవ్వుకుంది.నా మొహానికి 30 లక్షలు ఏంటి అని.ఇలా అనుకోని ఐడియా ని పక్కన పెట్టేసింది. కానీ ప్రతిరోజు ఈ బిజినెస్ పెట్టుకోవాలి,money వస్తాయి కదా అని ఎన్నో thoughts ఆమెకు వస్తూ ఉండేవంట.

ఆమె తర్వాత ఎలా ఆలోచించింది అంటే ఒకవేళ నేను ఈ బిజినెస్ చేయకపోయినా వేరే వాళ్ళకి బిజినెస్ ఐడియా చెప్తాను అప్పుడు వాళ్ళు ఒకవేళ స్టార్ట్ చేద్దాం అని చెప్పినట్లయితే నేను వాళ్ళను షేర్ అడగవచ్చు అని చెప్పి ఈ ఐడియాని కనిపించిన ప్రతి ఒక్కరితో చెప్తూ ఉండేదంట.

కానీ ఒకవేళ ఇలా ఎవరైనా ఇన్వెస్టర్ ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక గ్యారెంటీ ఉంది. కంపల్సరీ ఆమెకి వచ్చే ట్వంటీ ఎంక్వైరీస్ లో త్రీ ఆర్డర్స్ ఈ మిషన్ రిలేటెడ్ మాత్రమే ఉంటాయి.ఇక్కడ అమ్మాయికి ఒక స్పష్టత ఉంది. డైలీ ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి డీటెయిల్స్ అన్ని ఆమెకు తెలుసు ఏ మిషన్ కొనాలి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది మనకు ప్రాఫిట్ or loss వస్తుందని.

Business Ideas – Example 2:

ఇప్పుడు Business Ideas 2nd ఎగ్జాంపుల్ గురించి చెప్తాను.ఒక అబ్బాయి పౌల్ట్రీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు.అక్కడ శాలరీస్ ఇవ్వడం.other వర్క్,ఈ అబ్బాయి మాత్రమే చూసుకునేవాడు. అయితే మేనేజర్ ఒకసారి మాటల్లో ఆ అబ్బాయితో, ఆటో driver’s తో చాలా ప్రాబ్లంగా ఉంది. టైం కి రావట్లేదు వాళ్ళు. నిర్లక్ష్యం ఎక్కువ తాగి డ్రైవ్ చేస్తున్నారు.

చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు అప్పుడు వాళ్ళ మేనేజర్ చెప్పిన తర్వాత ఈ పౌల్ట్రీ అకౌంటెంట్ అబ్బాయి ఏమన్నాడు అంటే,సర్ నా తమ్ముడు చాలా మంచివాడు.నిదానంగా పనిచేస్తాడు కానీ చాలా పద్ధతిగా ఉంటాడు.మీరు జాబ్ ఇస్తారా చెప్పండి ఆటో మేమే కొనుక్కుంటాము.

మీరు జాబ్ ఇస్తాను అంటే మేము ఆటో కొనుక్కుని మేము వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. అప్పుడు మేనేజర్ వెంటనే మీరు తప్పకుండా work స్టార్ట్ చేయండి అర్జెంటుగా ఆటోని తీసుకోండి ఫస్ట్. నేను సపోర్ట్ చేస్తాను కావాలి అంటే మీ తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అడగండి వాళ్ళు కూడా వర్క్ లో జాయిన్ అవుతారు ఏమో అని.మీరు four members మెంబర్స్ ఒక గ్రూప్ అయ్యి వర్క్ ని చేసుకుంటూ వచ్చిన ఇన్కమ్ మీరు మాత్రం తీసుకోండి అని చెప్పాడు.

ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ ఆ అబ్బాయి ముందు ఏం తెలుసుకోకుండా బిజినెస్ లో ఎంటర్ అయి ఉంటే అసలు ఏం చేయాలో తెలిసేది కాదు.కానీ అబ్బాయికి అక్కడ ఉన్న బిజినెస్ ఎలా ఉంటుంది అని డీటెయిల్స్ అన్ని ఫుల్ గా తెలుసుకొని ఆటో బిసినెస్ అంతా తెలుసుకొని స్టార్ట్ చేశాడు.

ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్ లో ఇష్యూ ని అబ్బాయి చాలా ఈజీగా సాల్వ్ చేశాడు. అక్కడ అకౌంట్నెంట్ గానే ఉంటూ అక్కడ బిజినెస్ ఎలా రన్ అవుతుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది? Loss ఎంత వస్తుంది? అసలు బిజినెస్ ఎలా చేయాలి? అని పూర్తి విషయాలను తెలుసుకున్నాడు.

Business Ideas – Example 3:

ఇప్పుడు నేను మీకు Business Ideas మూడవ ఎగ్జాంపుల్ గురించి చెప్తాను.మీకు అందరికీ ఆర్టిస్ట్ ఆర్ పెయింటర్స్ వాడే బ్రష్ తెలుసు కదా దాన్ని ఎలా యూస్ చేస్తారు.ఒక ప్లేట్లో కలర్స్ అన్ని మిక్స్ చేసుకొని పెయింటింగ్ వేస్తూ ఉంటారు. అలా ఒక ఆర్టిస్ట్ కి ఒక ఐడియా వచ్చింది.

ఎలా అంటే మనం ప్రతిసారి కలర్స్ అన్ని మిక్స్ చేసి కలర్స్ వేస్తుంటాం కదా. ఇలా కాకుండా బ్రష్ లోనే కొంచెం పెయింటింగ్ స్టోర్ అయి ఉంటే చాలా బాగుంటుంది కదా.అంటే Ink బాటిల్ తీసుకొని మనం ఇంకా refill లో పోస్తూ ఉంటాం. ఇలా మనం పెయింటింగ్ లో కూడా వాడొచ్చు కదా అని అతనికి ఐడియా వచ్చింది.అలా బ్రష్ tip ప్లస్ pen containers రెండు యూస్ చేసి brush pen తయారు చేశాడు.

ఇలా అతనికి ఒక థాట్ వచ్చింది. అందరూ కొనేలా ఒక బ్రష్ ని తయారు చేశాడు ఇది చాలా చోట్ల వాడుతున్నారు ఇంకా మార్కెట్స్ లో ఉంది.ఈ థాట్ వచ్చింది ఒకరికి అతను అన్ని చోట్ల అందరికీ యూస్ అయ్యేలా ఇంప్లిమెంట్ చేశారు. ఇలా ఆర్టిస్ట్ లో మనకు చాలామంది ఉన్నారు కాకపోతే ఇతనికి మాత్రమే ఇలాంటి ఐడియా వచ్చింది. చాలామందికి వచ్చి ఉండొచ్చు బట్ ఇతను ఇంప్లిమెంట్ చేశాడు.

అలాగే amazon e-commerce ఇండియాకి వచ్చినప్పుడు అసలు ఈ బిజినెస్ మనకు ఫేమస్ అవ్వలేదు. ఎందుకు అంటే అప్పట్లో మనకు ఇంటర్నెట్ సేవలు సరిగా ఉండేవి కాదు. అలాగే ఇండియన్స్ ఎలా అనుకునే వాళ్ళు అంటే వస్తువు చేతికి రాకముందుకే మనం ఎలా మనీ పే చేయాలి అని ఆలోచించేవారు.

ఇలా వస్తువు ఇంటికి రాకముందే మనీ పే చేయడం వల్ల చాలామంది ఈ బిజినెస్ ని సరిగా యూస్ చేసుకోలేకపోయారు. కాబట్టి ఇలాంటి ఒక థాట్ ని ఇంప్లిమెంట్ చేస్తూ Flipkart వాళ్లు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. వస్తువు ఇంటికి వచ్చాకే మీ చేతికి చేరుకున్నాకే డబ్బులు ఇవ్వండి అని.

ఇలా కాష్ ఆన్ డెలివరీ ఉండటం మనం పోస్ట్ ఆఫీస్ లో అబ్సర్వ్ చేయవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్ లో మనం VPP డెలివరీ అని ఒకటి ఉంటుంది. అది వాళ్ళు పోస్ట్ ఇచ్చిన తర్వాత మనం మనీ పే చేస్తాం.ఇలాంటి ఒక thought ఫ్లిప్కార్ట్ వాళ్లు తీసుకొని వచ్చారు.

ఇది చాలా ఫేమస్ అయింది.ఇలా బోలెడన్ని అవకాశాలు మీ కంటి ముందునే కదలాడుతూ ఉంటాయి. బిజినెస్ లో మనకు ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్.ఇది వచ్చాకే మనకు ప్రాఫిట్ ఎంత? లాస్ ఎంత? మరియు ఇది గ్యారెంటీగా ప్రాఫిట్ ఇస్తుందా అనేసి మనకు తెలుస్తుంది.

Business Ideas – Must Follow tips:

కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అందులో ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. అందులో ప్రాఫిట్ ఎంత?loss ఎంత? మరియు ఈ బిజినెస్ చేస్తే మనకు అసలు గ్యారంటీగా ఇన్కమ్ వస్తుందా?

అనే ప్రతి ఒక్క విషయాన్ని మీరు అనలైజ్ చేసుకున్న తర్వాతే బిజినెస్ ని స్టార్ట్ చేయండి.అంతేకాకుండా మనకు బిజినెస్ అంటేనే ఒక్కొక్కసారి లాస్ వస్తుంది.

కాకపోతే మీరు ఒక బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకొని దాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత నేను business చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చాకే స్టార్ట్ చేయండి.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post