Search
Close this search box.
తెలుగు టైపింగ్ వర్క్ చేస్తూ రోజు 300 సంపాదించండి

తెలుగు టైపింగ్ వర్క్ చేస్తూ రోజు 300 సంపాదించండి | పార్ట్ టైమ్ తెలుగు జాబ్స్ 2023

Facebook
WhatsApp
Telegram

తెలుగు టైపింగ్ వర్క్ చేస్తూ రోజు 300 సంపాదించండి.వర్క్ ఎలా చేయాలి? ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.వేగవంతమైన ఈ డిజిటల్ ప్రపంచంలో,బహుభాషా కంటెంట్‌కు చాలా డిమాండ్ పెరుగుతోంది. అనేక వ్యాపారాలు మరియు వ్యక్తులు ఆడియో మరియు వీడియో కంటెంట్‌ను ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేయడానికి సమర్థవంతమైన మార్గాల కోసం వెతుకుతున్నారు.

తెలుగు టైపింగ్ వర్క్ చేస్తూ రోజు 300 సంపాదించండి

హిందీ వీడియోలను తెలుగు టెక్స్ట్‌గా మారుస్తూ ఇంట్లో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని తక్కువ జీతంతో ప్రారంభించవచ్చు.మరి ఇలాంటి ఉద్యోగానికి అవసరమైన సాధనాలు ఏమిటి? ఆ యొక్క స్కిల్స్ ఎలా ఉండాలి? ఎలా మంచి కెరీర్ ఎంపికగా ఎలా మారుతుంది అనే విషయాలను మనం తెలుసుకుందాము.

తెలుగు టైపింగ్ వర్క్ చేస్తూ రోజు 300 సంపాదించండి

వీడియో కంటెంట్

ప్రస్తుతం వీడియో కంటెంట్ ఇంటర్నెట్‌లో ఎక్కువ శాతం ఆక్రమించింది. ఎడ్యుకేషనల్ ట్యుటోరియల్స్ నుండి మొదలుకొని వినోదం వరకు, వీడియోలు ఆలోచనలు మరియు సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతున్నాయి.

అయితే,ఇక్కడే మనకు ఉపాది లభించనుంది,చూడండి అందరూ ఒకే భాష మాట్లాడరు కాబట్టి, ఇక్కడే ట్రాన్స్‌క్రిప్షన్ యొక్క అవసరం పడుతుంది.అదే transcription వర్క్ ని మనం చేయబోతున్నాము.


హిందీ నుండి తెలుగు టైపింగ్ వర్క్ అంటే ఏమిటి?

హిందీ నుండి తెలుగు టైపింగ్ పనిలో మాట్లాడే హిందీ పదాలు మరియు డైలాగ్‌లను వీడియోల నుండి వ్రాతపూర్వక తెలుగు వచనంలోకి లిప్యంతరీకరించడం ఉంటుంది. ఈ పనికి రెండు భాషలపై లోతైన అవగాహన అవసరం, అలాగే టైపింగ్ మరియు వ్యాకరణంలో నైపుణ్యం అవసరం.

అనువాదం యొక్క ఇంపార్టన్స్

ఈ పనిలో ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనది.అనువదించడంలో ఒక చిన్న తప్పు ఆ వాక్యం యొక్క అర్థాన్ని మార్చగలదు, ఇది అపార్థాలు లేదా తప్పుడు వివరణలకు దారి తీస్తుంది.కాబట్టి అనువాదం లేదా కంటెంట్ విశ్లేషణ వంటి వివిధ పనులలో చాలా జాగ్రత్తగా అనువదించడం ముఖ్యం.

నైపుణ్యాలు అవసరం

ద్విభాషా ప్రావీణ్యం – అంటే హిందీ వీడియో నుండి తెలుగు టెక్స్ట్ టైపింగ్ పనిలో రాణించడానికి, రెండు భాషలలో నిష్ణాతులు కావాలి. దీనర్థం పదాలను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా కంటెంట్‌లోని చిన్న చిన్న పదాలను సైతం అర్థం చేసుకునే నైపుణ్యాలు, మాటలు మరియు ఆయా సందర్భాన్ని కూడా గ్రహించి టైపింగ్ చేయాలి.

టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం

వేగవంతమైన మరియు పర్ఫెక్ట్ టైపింగ్ స్కిల్ అవసరం. ట్రాన్స్‌క్రైబర్‌లు ఎక్కువ టైమ్ ని ఫోలో అవుతూ వర్క్ చేస్తారు, సరైన గడువులతో పని పూర్తి చేస్తారు, కాబట్టి ఖచ్చితత్వంతో రాజీ పడకుండా త్వరగా టైప్ చేసే సామర్థ్యం మీకుండాలి.

వాక్యం అర్థమయ్యే విధంగా రాయడం మరియు విరామ చిహ్నాలు పాటించడం

ఆడియో లో చెప్పిన విధముగా ఆ వాక్యం పొందికగా మరియు దోష రహితంగా ఉండేలా రాయడం మరియు విరామచిహ్నాలు ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడ కూడదు అనే దాని పైన బలమైన పట్టు అవసరం.

కావలసిన టెక్నికల్ పరికారాలు

ట్రాన్స్క్రిప్షన్ సాఫ్ట్వేర్: ట్రాన్స్‌క్రైబర్‌లు తరచుగా ప్రత్యేకమైన ట్రాన్స్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు, అది వీడియోను లేదా ఆడియో ని ప్లే చేస్తూ టైప్ చేయడానికి మరియు ఏకకాలంలో టైప్ చేయడానికి వారికి ఉపయోగపడుతుంది. ఈ సాధనాలు టైమ్ కోడింగ్ మరియు ఫార్మాటింగ్‌లో కూడా సహాయపడతాయి.

హెడ్‌ఫోన్‌లు

వీడియోలో మాట్లాడే కంటెంట్‌ను స్పష్టంగా వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి మంచి-నాణ్యత గల హెడ్‌ఫోన్‌లు ఉండటం తప్పనిసరి.లేదా మీరు ఉండే రూమ్ లేదా ఆవరణం Disturbance కి దూరంగా ఉంటే ఈ హెడ్ఫోన్ కూడా ఏం అవసరం లేదు.

రిఫరెన్స్ మెటీరియల్ (ఆడియో లేదా వీడియొ)

ట్రాన్స్‌క్రైబర్‌లు ఖచ్చితత్వం మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి డిక్షనరీ లేదా స్టైల్ గైడ్‌లను ఉంచుకోవచ్చు.లేదా మీకు ఆడియో వీడియొ ఫైల్ అందుబాటులో ఉంటే వాటితో పని స్టార్ట్ చేయవచ్చు.

Typing చేసేటపుడు జాగ్రత్తగా విని టైప్ చేయడం

వీడియోలు లేదా ఆడియో లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కలిగి ఉండవచ్చు, మాట్లాడే పదాలను అర్థంచేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ట్రాన్స్‌క్రైబర్‌లు ఓపికగా మరియు వివరాలకు శ్రద్ధగా విని టైపింగ్ చేయాలి.

టెక్నికల్ నాలెడ్జ్

వీడియో అనేది ఆయా విషయం అనగా సబ్జెక్టు పై ఆధారపడి ఉంటుంది, సాంకేతికమైనటువంటి లేదా ప్రత్యేక పదజాలం చాలా చోట్ల ఉపయోగించబడవచ్చు. ఖచ్చితమైన అనువాదం అందించడానికి ట్రాన్స్‌క్రైబర్‌లు అటువంటి టెక్నికల్ పరి భాషలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి.

ట్రాన్స్‌క్రైబర్‌ కెరీర్ అవకాశాల

మనం ముందుగానే మాట్లాడుకొన్నాము,బహుభాషా కంటెంట్ కోసం డిమాండ్ పెరుగుతూనే ఉంది, నైపుణ్యం కలిగిన ట్రాన్స్‌క్రైబర్‌ల అవసరం కూడా చాలా పెరుగుతుంది అని. హిందీ వీడియో నుండి తెలుగు టెక్స్ట్ టైపింగ్ వర్క్ కోసం అవసరమైన భాషా నైపుణ్యాలు మరియు వివరాలపై శ్రద్ధ ఉన్న వారికి మంచి కెరీర్ ఉంటుంది.

Ex: యూట్యూబ్ ,ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ ,ఫ్రీలాన్సర్ ఇలా తదితర రంగాలలో చేయవచ్చు మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చు.

ఫ్రీలాన్సింగ్

చాలా మంది వ్యక్తులు ఫ్రీలాన్స్ ట్రాన్స్‌క్రైబర్‌లుగా పని చేయడానికి ఎంచుకుంటారు,ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హో పని చేస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించడానికి ఇలాంటి వాటిని ఎంచుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్‌లకు తమ సేవలను అందిస్తారు. ఈ ఫ్లెక్సిబుల్ కెరీర్ వారు తమ ఇళ్లలోని సౌకర్యం నుండి పని చేయడానికి చాలా అనువైనది.

ట్రాన్స్క్రిప్షన్ ఏజెన్సీలు

ట్రాన్స్‌క్రిప్షన్ ఏజెన్సీలు తరచుగా వివిధ రకాల ప్రాజెక్ట్‌లను నిర్వహించడానికి బాగా నైపుణ్యం కలిగిన ట్రాన్స్‌క్రైబర్‌లను నియమిస్తాయి. మీకు స్కిల్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిలో పనిచేయవచ్చుఅలాగే ఇది ఒక స్థిరమైన ఆదాయ వనరు మరియు కెరీర్ వృద్ధికి అవకాశాలను అందిస్తుంది.

ఉదాహరణ కి ఈ వర్క్ ని ఎలా చేయాలో చ్చపిస్తాము రండి – మీరు కూడా ఈరోజు నుంచే ఇంట్లో ఉంది డబ్బులు సంపాదించడం ప్రారంభించవచ్చు

మీరు మీకు పంపించిన ఆడియో లేదా వీడియొ ని చూస్తూ ఈ క్రింది విధముగా టైపింగ్ చేయవలసి ఉంటుంది.

ఉదాహారణకి ఈ వీడియొ చూడండి

ఈ వీడియొ లో ఉన్నది ఉన్నట్టు ఈ క్రింద టైపింగ్ చేయబడింది చూడండి

నమస్తే మిత్రులారా! ఒక ముఖ్యమైన వీడియోలోకి మీ అందరికీ స్వాగతం, ఒక వేళ మీరు options trading చేస్తుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రోజు వీడియోలో నేను మీకు options trading కి సంబంధించి ఒక పెద్ద, అద్భుతమైన scalping trading యొక్క వ్యూహం గురించి చెప్పబోతున్నాను.

చూడండి మిత్రులారా, ఒకవేళ మీరు options trading చేస్తుంటే మీకు రెండు విధములైన సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఇవి చాలా పెద్దవి కాబట్టే మీరు స్థిరత్వంగా లాభాలు పొందటానికి చాలా ఇబ్బందులు పడేలా చేస్తుంది. నా ఉద్దేశం ఏమిటంటే మీరు options trading లో trade చేసేటప్పుడు ఒకవేళ మీరు market ఒక పాయింట్ తో పైకి వెళ్తుంది అని భావిస్తే market పైకి వెళ్లినప్పుడు లాభం కలుగుతుంది, కిందకి వెళ్తే నష్టం.

కానీ market పైకి వెళ్లడంలో కూడా ఒక ధోరణి ఉంది. ఒకవేళ market పైకి నెమ్మదిగా కదిలితే కూడా మీ premium పెరగదు మీరు నష్టం చూస్తారు. options trading లో అన్నింటికంటే ముఖ్యమైనది momentum. మీకు లాభం కావాలంటే fast momentum కావాలి ఒకటి ఫాస్ట్ moment కావాలి మరొకటిది మీ తరపున moment కావాలి.

ఈ రోజు వీడియోలో చాలా అధ్బుతమైన మరియు ఖచ్చితమైన వ్యూహం గురించి చెప్పబోతున్నాను ఒకవేళ మీర్ ఈ వ్యూహాన్ని ఉపయోగించినట్లైతే మీకు చాలా మంచి ఫలితాలు options tradingలో కలుగుతుంది. వ్యూహం ఏంటో చాలా రకాల charts తీసుకుని చెప్తాను, stoploss ఎక్కడ వాడాలి, target ఎక్కడ పెట్టాలి, ఎలా మీరు scale up చేయవచ్చు అన్నీ విషయాల గురించి ఈ రోజు నేను చెప్పబోతున్నాను.

మీరు నేను చెప్పే విషయాలని అర్దం చేసుకోకుండా, ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకోకుండా వీడియో చూడ్డంలో ఎటువంటి లాభం లేదు.పదండి మిత్రులారా వీడియోని మొదలుపెడదాము

నేను ముఖ్యమైన మరియు అవసరమైన విషయాలను మాత్రమే చెబుతాను కాబట్టి వీడియోకి 10k likes మరియు ఒక్కొక్కరు ఇద్దరికీ వీడియోలను share చేయండి మరియు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారో మీరు comment లో నాకు తెలియ చేయండి.

Big bar అర్ధం పెద్ద candle అని, ఉదాహరణకి మార్కెట్ కదులుతువుంది చిన్న candles ఏర్పడుతున్నాయి అలా పోతూ పోతూ ఒక దగ్గర మునుపటి candle కంటే 60, 70% పెద్ద candle ఏర్పడింది అనుకోండి అప్పుడు దానిని Big bar అని అంటారు.

మరొక విధానం గురించి చూద్దాం అది ఏమిటంటే support resistance ని మరియు trend line ని ఉపయోగించడం. మీరు timeframe కేవలం 5 నిమిషాలూ మాత్రమే వాడాలి. ఇక్కడ chart ని బాగా గమనించండి మనకు support దొరికేసింది. ఇక్కడ market ఒక గంటకు పైగా చాలా మంచి సమయం వెచ్చించింది.

ఇక్కడ అన్నీ candles ను పోల్చుకుంటే ఒక పెద్ద green candle ఏర్పడింది. ఈ క్యాండిల్ యొక్క high లో మీరు trade తీసుకోవాలి మరియు low వచ్చి మీ stoploss అవుతుంది. చూడండి మీకు ఎంత మంచి టార్గెట్ లభించిందో, ఇప్పుడు చూడండి మీరు రెండు విషయాలను గమనించాలి nifty లో 5 candles 30 పాయింట్స్ రేంజ్ మరియు banknifty లో 5 candles సమయం వెచ్చించాలి మరియు 80 పాయింట్స్ రేంజ్ ఇందులో చాలా మంచి ఖచ్చితత్వం లభిస్తుంది.

ఇక్కడ చూడండి మార్కెట్ ఒక ర్యాలీ లాగా ఏర్పడింది అంటే ముందుగా gap up తర్వాత కొంచెం సేపు resistance ఏర్పడుతువుంది ఇక్కడ మార్కెట్ చాలా సేపు టైమ్ పాస్ చేసింది దీని range ఒకసారి గమనిస్తే 18 పాయింట్స్ range ఎంత తక్కువ range ఉంటే అంత ఎక్కువ నిరాశ కలుగుతుంది అంతే మంచి targets కూడా చూడ్డానికి లభిస్తాయి. 30 పాయింట్స్ గరిష్ట range ఎంత తక్కువ range ఉంటే అంత మంచి టార్గెట్స్ దొరుకుతాయి.

మార్కెట్ టైమ్ పాస్ చేసిన తర్వాత ఒక పెద్ద ఎరుపు క్యాండిల్ ఏర్పడింది. ఈ క్యాండిల్ యొక్క low లో trade తీసుకుంటారు మరియు high వచ్చి stoploss చూసారా ఎంత మంచి టార్గెట్ ఏర్పడిందో. ఇక్కడ stoploss చూస్తే 20 పాయింట్స్, 10 పాయింట్స్, 5 పాయింట్స్ ఇలా ఉంటుంది.

మీ మొదటి టార్గెట్ 1:1 తర్వాత 1:2, 1:3 ఇలా మీ టార్గెట్స్ మంచిగా సాధించవచ్చు. నేను ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాణం 3 వరకు live లో వుంటాను మీరు అక్కడ చక్కగా నేర్చుకోవచ్చు. మీరు భలవంతంగా trade తీసుకోలేరు అలాగే ఏది పడితే ఆ trade తీసుకోలేరు.

ఒకవేళ మీరు 200 premium తీసుకుంటే అది 220 అయినట్లైతే మీరు వెంటనే లాభాన్ని బుక్ చేసుకోండి నష్టంతో మాత్రం బయటకి రావద్దు.
ఇంకో big బార్ ఉదాహరంగా చూద్దాం, ఇక్కడ డబుల్ టాప్ ఏర్పడింది మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్లింది మళ్ళీ కిందకి పడింది.

ఇక్కడ support resistance చూడ్డానికి లభించింది తర్వాత market కొంచెం సేపు టైమ్ పాస్ చేసింది తర్వాత ఒక బిగ్ క్యాండిల్ ఏర్పడింది. దీన్ని మీరు triple టాప్ formation అని కూడా అనవచ్చు ఆ big క్యాండిల్ దగ్గర ఎంట్రీ మరియు stoploss నిర్ణయించుకుంటాం చూడండి ఎంత మంచి target లభించిందో.

ఇంకో విషయం ఏమిటంటే కొన్ని సార్లు trade ఏర్పడదు అటువంటి సమయంలో బలవంతమైన trade చేయవద్దు. మరియు ట్రేడ్ ఎప్పుడు support ,resistance మరియు trend line దగ్గర మాత్రమే తీసుకోవాలి.big bar ఉన్న ప్రతి చోట మీరు ట్రేడ్ తీస్కోలేరు support ,resistance మరియు trend line చూస్కోని మాత్రమే మీరు trade తీస్కోవాలి.

మరొక ఉదాహరణ చూడండి ఇక్కడ support ఏర్పడింది, రెండు విధాలుగా big bar పని చేస్తుంది support మరియు support ఇక్కడ చూడండి ఒక range ఏర్పడింది ఇక్కడ నుంచి market పైకి వెల్లచ్చు లేకుంటే కిందకి కూడా వెళ్లొచ్చు మీరు ఎదురు చూసి ట్రేడ్ చేస్తే చాలు trading లో common sense కూడా వాడాలి support break అయ్యేంత వరకు trade తీసుకోకూడదు. మునుపటి దాంట్లో hammer ఏర్పడి market పైకి వెళ్లింది కాబట్టి ఇక్కడ కూడా big candle

ఏర్పడి మార్కెట్ పైకి వెళ్లొచ్చు క్యాండిల్ ప్రకారం entry మరియు stoploss నిర్ణయించుకుంటే చాలు మీ target సాదించవచ్చు. ఇలాగ మీరు 8 నుంచి 10 శాతం లాభం తో scalp trading చేయవచ్చు. ఇదే విధంగా మీరు banknifty లో కూడా ప్రయత్నించవచ్చు.

వీడియొ టైపింగ్ చేసేటపుడు ఇంపార్టంట్ విషయాల వద్ద స్క్రీన్ షాట్స్ లను జోడించాలి – స్క్రీన్ షాట్ తో సహ కలిగిన ఈ ఫైల్ ని ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ ని క్లిక్ చేసి చూడగలరు.

అప్లై చేశాక – మీరు చేయవలసిన వర్క్ ఆడియో – వీడియొ ఫైల్స్ మీకు అందించబడతాయి.ఆ వీడియొ వింటూ లేదా వీడియొ చూస్తూ – ఒక డాక్యుమెంట్ ఫైల్ టైప్ చేశాక – తిరిగి పంపించాల్సి ఉంటుంది.పంపించిన వెంటనే ఆ ఫైల్ ని చెక్ చేసి – మీకు మనీ క్రెడిట్ చేస్తారు.

పేమెంట్ చేయు విధానము

గూగుల్ పే ,ఫోన్ పే ద్వారా మీకు పేమెంట్ చేయబడుతుంది.

ఎలా అప్లై ఛేయాలి?

ఆసక్తి ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ,అప్లై చేయడానికి క్రింద కనిపిస్తున్న Apply Online ని క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు ( ప్రస్తుతం కొన్ని ఖాళీలు మాత్రమే కలవు)

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)


ఈ Transcription పని చేయడానికి హిందీ మరియు తెలుగు రెండూ మాతృభాషగా రావలసిన అవసరం ఉందా?

రెండు మాతృ బాష ఉండాల్సిన అవసరం అయితే లేదు కానీ, ప్రావీణ్యం,అవగాహన అనేది రెండు భాషలపై ఉండటం అనేది చాలా ముఖ్యమైనది.

ఏ రకమైన వీడియోలు సాధారణంగా హిందీ నుండి తెలుగులోకి అనువదించబడతాయి?

సినిమా వినోదం, విద్య, వార్తలు, వ్యాపారం, డబ్బు సంపాదన మరియు మరిన్ని ఇలాంటి వివిధ రకాలైనటువంటి వీడియోలకు అనువాదం అవసరం కావచ్చు.

ఈ రకమైన పని కోసం ఏవైనా ధృవపత్రాలు లేదా కోర్సులు ఉన్నాయా?

కొన్ని ఆన్‌లైన్ కోర్సులు ట్రాన్స్‌క్రిప్షన్ నైపుణ్యాలలో శిక్షణను అందిస్తాయి, ఇది నూతనంగా ప్రారంబించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

హిందీ వీడియో నుండి తెలుగు టెక్స్ట్ టైపింగ్ పని కోసం నేను క్లయింట్‌లను ఎలా వెతకాలీ?

ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అయినటువంటి Fivver, Upwork, మరియు మరెన్నో జాబ్ బోర్డులు అలాగే కొన్ని రాకలైన నెట్‌వర్కింగ్ ఇండస్ట్రీస్ లు అనేవి క్లయింట్‌లను కనుగొనడానికి మంచి మార్గాలు అని చెప్పవచ్చు.

ఈ రంగంలో సంపాదన సామర్థ్యం ఎంత?

ముఖ్యంగా చెప్పాలి అంటే అనుభవం, క్లయింట్ యొక్క డిమాండ్‌లు మరియు కంటెంట్ రాసే విధానము పై ఆధారపడి ఆదాయాలు మారవచ్చు. అనుభవజ్ఞులైన ట్రాన్స్‌క్రైబర్‌లు వారి నైపుణ్యంతో ఎక్కువ సంపాదిస్తారు. ఫ్రెషర్స్ గా మీరు బాగా రాయగలిగితే మీరు కూడా ప్రారంభంలో ఎక్కువే సంపాదన చూస్తారు.

ఇతర Transcription ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిClick Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post