Search
Close this search box.
Salaar Movie

Salaar Movie బ్లాక్ బస్టరె కానీ విషాదం

Facebook
WhatsApp
Telegram

Salaar Movie : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఒక విషాదం చోటుచేసుకుంది. సలార్ సినిమా విడుదల సందర్భంలో ఒక అభిమాని విద్యుత్ ఘాతంతో మరణించాడు.బాలరాజు(27) గురువారం నగరంలోని రంగా థియేటర్ ముందు ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.

Salaar Movie


బాలరాజు, అతడి స్నేహితులు ఫ్లేక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా.. ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకడంతో కరెంట్ షాక్‏కు గురై బాలరాజు అక్కడికక్కడే మరణించాడు . గజేంద్ర అనే యువకుడు గాయపడ్డాడు.

ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాలరాజు కొంతకాలం నుండి ఒక బట్టల కంపెనీలో పని చేస్తున్నాడు.

బాలరాజు కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి లో నివసిస్తున్నాడు.బాలరాజుకు ఒక భార్య ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.బాలరాజు మరణంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

మృతుడి కుటుంబ సభ్యులు, ప్రభాస్ అభిమానులు నిన్న రాత్రి నిరసన తెలిపారు.ధర్మవరం 1వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఆ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post