Search
Close this search box.
New Ration Card Rules 2024

New Ration Card Rules 2024 లో జరిగిన మార్పులు | పరిశీలించే అంశాలు?

Facebook
WhatsApp
Telegram

New Ration Card Rules 2024: తెలంగాణ లో కొత్త రేషన్ కార్డుల కోసం 7ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వం శుభవార్త తెలియజేయనుంది.తెలంగాణ రాష్ట్రం లో కొత్త రేషన్ కార్డులు పొందాలి అంటే నియమాలు మరియూ నిబంధనలు తెలుసుకుందాము.కొత్త రేషన్ కార్డులు అందించాలి అని పౌర సరఫరాల శాఖ సన్నహాలు మొదలు పెట్టింది.

New Ration Card Rules 2024

New Ration Card Rules 2024 – కొత్త రేషన్ కార్డు అర్హులకు ప్రభుత్వం నుండి శుభవార్త

గ్రామ సభలు నిర్వహించి తొలుత దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆ తరవాత ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టి అర్హులైన వారికి కొత్త కార్డులను జనవరిలోనే ఇవ్వాలని భావిస్తున్నది.ఇందుకోసం అనుసరించిన విధి విధానాలను.. అర్హతలను పరిగణలోకి తీస్కోవలిసిన అంశాలతో మార్గదర్శకాలు రూపొందించింది.

జనవరి 24న జరిగే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చించడానికి పౌర సరఫరాల శాఖ 5 పేజీల డాక్యుమెంట్ ను తయారు చేసింది.కొత్త రేషన్ కార్డులను పొందడానికి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అన్ని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ డాక్యుమెంట్ లో పేర్కొంది.

ప్రజాపాలనలో భాగం గా గ్రామలలో జరిగే గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వాల్సింది గా చాటింపు వేయాలని పేర్కొంది. డిప్యూటీ తాశీల్ధార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా చెకింగ్ ఇన్స్పెక్టర్ గ్రామాల్లో తిరిగి ప్రజలకి దరఖాస్తుల గురించి వివరించాలని అన్నారు.

నిర్ధిష్ట ఫార్మాట్‌లో భర్తి చేసిన దరఖాస్తులను పరిశీలించడానికి,ఫిజికల్ వెరిఫికేషన్ చేయించేందుకు కలెక్టర్ మొదలు తాశీల్ధార్ వరకు పటిష్టమైన మెకానిజమ్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించారు.దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేసే ఇంచార్జి అధికారి దరఖాస్తుదారుని అర్హతలను పరిగణలోకి తీస్కోవాలని స్పష్టత చేసింది.

ఫోటోస్టేఫీ కార్డ్ ఇవ్వకూడదు అని వెరిఫికేషన్ ఆఫీసర్ భావిస్తే అందుకే సంబందించిన వివరాలు : అనర్హులు, బోగస్,ఇతరులు అని పేర్కొనాలని స్పష్టతను ఇచ్చింది.

Ts New Ration Card Rules Verification అధికారిదే బాధ్యత :

ప్రజల నుండి వచ్చే దరఖాస్తులన్నిటిని సేకరించి వాటికి నంబరు ఇవ్వాలని,రిజిస్టర్ లో నమోదు చేయమని,వాటి అన్నిటినీ సంభందిత తాశీల్ధార్ లేదా అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ ఆఫీసర్ కి అందచేయాలని పేర్కొంది.మండల స్థాయీలో తాశీల్ధార్ నోడల్ అధికారిగా వ్యవహరించాలని.

ఈ మొత్తం ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలి.రేషన్ కార్డులు మంజూరులో ఎక్కడ తేడా వచ్చినా వెరిఫికేషన్ అధికారిదే బాధ్యత అని పూర్తిగా వారే జవాబుధారిగా ఉంటారని.ఇంటిని విజిట్ చేసినట్లుగా సర్టిఫికేట్లో తేది సమయం తో పాటూ సేకరించిన వివరాలను పొందుపరచాలి అని సివిల్ సప్లైస్ ఆ డాక్యుమెంట్ లో స్పష్టత చేసింది.

ప్రజల నుండి దరఖాస్తులు అందిన తర్వాత మొదటి దశ లో పేర్కొన్న భూముల వివరాలతో అధికారులు పోల్చి చూస్తారు.ఇందుకోసం భూమాత పోర్టల్ ను అధికారికం గా పరిగణలోకి తీసుకుంటారు.

New Ration Card Rules N.I.C Portal లో ఉన్న వివరాలే నిర్దిష్టం :

N.I.C పోర్టల్‌లో ఉన్న వివరాలను నిర్దిష్టంగా ఆ గ్రామానికీ సంబందించినవిగా డౌన్‌లోడ్ చేసి,వెరిఫికేషన్ ఇంచార్జి తాశీల్ధార్ కి అసిస్టెంట్ సివిల్ సప్లైస్ అధికారి అప్పగిస్తారు.వాటి ఆధారం గా ధృవీకరణ ఇంచార్జి భౌతిక విచారణకి వెళుతారు.

New Ration Card సమయం లో పరిశీలించే అంశాలు:

ఇంటి స్వభావం: పెంకుటిల్లు,గుడిసె,సిమెంట్ కాంక్రీట్ స్లాబ్,ప్లాస్టిక్ పైకప్పు,రేకుల పైకప్పు,ఇంట్లో ఉంటున్న వారి సంఖ్య,సభ్యుల వివరాలు.

ప్రతి ఒక్కరి వివరాలు: ఆధార్ నంబర్లు అవసరం అయితే ఆధార్ పత్రాలను పరిశీలించడం.

ఉపాధి వివరాలు: రోజు వారి కూలీ, పార్ట్ టైమ్, అవుట్ సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి, స్వయం ఉపాధి

భూమి వివరాలు: స్వాధీనంలో ఉన్నాడా,అనుభవం లో ఉన్నాడా,ఫోర్ వీలర్స్ సొంతం గా ఉన్నాయా,
కుటుంబం సభలో అంగ వైకల్యం ఉన్న వారి వివరాలు,ఆది వాసులు,గిరిజనులు ఉంటే వారి వివరాలు,
ఆదాయపు పన్ను మదింపు ధరులు,పన్ను మదింపులు ఉన్నాయా లాంటి వివరాలు సేకరించాలి అని పేర్కొంది.

కలెక్టర్‌ సమావేశంలో పౌరసరఫరాల శాఖ :

రేషన్‌కార్డులు పొందేందుకు అర్హులపై పౌరసరఫరాల శాఖ.. కలెక్టర్‌ సమావేశంలో ప్రతిపాదించిన డాక్యుమెంట్‌లో నిర్ధిష్టం గా కొన్ని ప్రామాణికాలను అందించింది.పేదలకు పౌర సరపరాల విభాగం ద్వార లభించే సౌకర్యాలను అందించే ఉద్దేశంతో కార్డులు ఇస్తున్నందున అవి దుర్వినియోగం కాకుండా నిజమైన లబ్ధి ధారులకు న్యాయం జరిగేలా ఉండాలని.. కొన్ని నిబంధనలను రూపొందించింది.

New Ration Card Rules పరిమితులు:

కుటుంబ సభ్యులందరివి గరిష్ట వార్షిక ఆదాయం,గ్రామలలో లక్ష,పట్టణాలలో రెండు లక్షలు దాటరాదు అని తెలియజేసారు.ఒకవేల కాంట్రాక్టు,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఏడాధికి పైన తెలిపిన లిమిట్ దాటద్దని,కుటుంబం మొత్తానికి మూడున్నర ఏకరాలు మించి తడి,మాగాని,ఏడున్నరా ఏకరాలు మించి మెట్ట ,పోడు,సాగు భూమి ఉండకూడదని తెలిపారు.

భూమి విస్తీర్ణం మాత్రమే క్రైటీరియా కాకుండా దాని మీద వస్తున్న ఆదాయం పైనా పేర్కొన్న వార్షిక ఆదాయంకి మించొద్దని చెప్పారు.ప్ర‌భుత్వం,ప్ర‌భుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు రేషన్ కార్డుల‌కి అన‌ర్హులు గానూ,ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల వార్షిక ఆదాయం సీలింగ్ మించొద్దన్నట్టుగా పేర్కొన్నారు.

వైద్యులు,కాంట్రాక్టర్లు,నిపుణులు,స్వంతంగా వ్యాపారం చేస్కోనే వారు అనర్హులు అనీ, భారీ స్థాయీ వ్యాపారులు, ఆయిల్ మిల్లులు,పెట్రోల్ బంక్‌లు,షాపుల యజమానులు కూడా అనర్హులుగా పేర్కొడం జరుగుతుందని తెలియజేశారు.

ప్రభుత్వ పింఛన్ దారులు,రిటైర్డ్ ఉద్యోగులు,స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న వారు అనర్హులు.4 వీలర్లు,వాణిజ్య వాహనాలు JCB వాహనాలు లాంటివి ఉండద్దని స్పష్టం చేశారు.వెరిఫికేషన్ సమయంలో కుటుంబ సభ్యుల జీవన ప్రమాణాలు,లైవ్ సప్లైస్,ఆస్తిపాస్తులు తదితరాలను పరిగణలోనికి తీస్కొని రేషన్ కార్డు పొందడానికి పేదలను అర్హులుగా గురించాలని పేర్కొన్నారు.

New Ration Card కి ఒకే ఇంట్లో వేరు వేరు కుటుంబాలు ఉంటే:

ఫిజికల్ వెరిఫికేషన్ సమయం లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ప్రకారం గతం లో ఒకే కుటుంబ సభ్యులుగా పాత రేషన్ కార్డులో పేర్లు నమోదు అయ్యి ఇప్పుడు అదే చిరునామా కలిగిన నివాసం లో వేరే కుటుంబ సభ్యులుగా ఉన్నట్లుగా వెరిఫికేషన్ ఇంఛార్జి సంతృప్తి చెందినట్లు ఐతే,కార్డ్ తీస్కోడానికి అర్హత ఉంటుందని డాక్యుమెంట్ లో పౌర సరఫరాల శాఖ పేర్కొంది.

గతం లో పాత కార్డులో పేర్లు లేకుండా ఇపుడు మాత్రమే కొత్త కార్డు తీస్కోడానికి దరఖాస్తు చేసుకున్నట్లైతే మంజూరు చేయవచ్చని పేర్కొన్నది.ఆధార్ కార్డును ప్రామాణికం గా తీసుకుని,ఇపుడు కొత్త కార్డులు పొందుతున్న వారు గతం లో పాత కార్డు రాష్ట్రంలో ఎక్కడైనా లేదని నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది.

New Ration Card అర్హులకి అందాలనీ ఉద్దేశ్యం:

అర్హులకి తప్పనిసరిగా కొత్త రేషన్‌కార్డులు అందజేయాలనే ఉద్దేశ్యంతో పౌరసరఫరాల శాఖ నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు అర్హత లేకపోయిన అనుభవిస్తున్న కారణం గా పేదలకు అవకాశాలు చేజారకూడదని స్పష్టం చేసింది.

ఇతర సంక్షేమ పథకాలకు Ration Cards ప్రామాణికం కాదు:

కొత్త రేషన్ కార్డులు కేవలం పౌర సరపరాల శాఖ ద్వారా బియ్యం అందుకునే ఉద్దేశ్యంతోనే మంజూరు చేయాలని భావిస్తున్నది.అందువల్ల ప్రభుత్వం నుండి ఇతర సంక్షేమ పథకాలకు ఈ కార్డులు ప్రామాణికం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.గతం లో దరఖాస్తు చేసి వెరిఫికేషన్ పూర్తి అయినా సరే వాటినీ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలనీ ప్రస్తుత నిబంధనలకి లోబడి ఉన్న వారికి కార్డ్స్ మంజూరు అవుతాయని పేర్కొన్నది.

  • రాష్ట్రం లో మొత్తం రేషన్ దుకాణాలు : 1858
  • కార్డుల కోసం వచ్చిన మొత్తం దరాఖాస్తులు : 1,08,45,196
  • వీటీ పరం గా కుటుంబ సభ్యుల సంఖ్య : 3,88,36,504
  • మంజూరుతో లబ్ది పొందుతున్న వారు : 2,80,06,107
  • తాత్కాలికంగా అప్రూవ్ అయినవి : 1,93,385 (వ్యక్తులు)
  • తిరస్కరణకు గురి అయినవి : 1,06,37,103 (వ్యక్తులు)
  • మొత్తం అప్రూవ్ అయ్యి వినియోగం లో ఉన్న కార్డ్స్ సంఖ్య : 89,98,458
  • తిరస్కరించిన కార్డుల సంఖ్య : 17,23,069
  • మైగ్రేషన్ లో ఉన్నా కార్డులు సంఖ్య : 1,40,232
  • మొత్తం కార్డులు LPG కనెక్షన్ ఉన్నవి : 63,12,773
dukebadi jobs logo icon

Trending Posts

Request For Post