భారత ప్రభుత్వ నేషనల్ కేరియర్ సర్వీస్ (NCS) పోర్టల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు – పూర్తి వివరాలు

పరిచయం:
NCS.GOV.IN Work From Home Jobs | మన ఇండియా లో ఉద్యోగం కోసం అనేక ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, నేషనల్ కేరియర్ సర్వీస్ (NCS) వెబ్సైట్ పోర్టల్ అనేది భారత ప్రభుత్వం ద్వారా రూపొందించబడిన ఒక మంచి వెబ్సైట్.ఇందులో నేషనల్ కేరియర్ సర్వీస్ (NCS) పోర్టల్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలు, ట్రైనింగ్ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి ఇలా చాలా ఉపాధి అవకాశాలు అందిస్తుంది.
ఈ పోర్టల్ ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం భారత ప్రభుత్వం ద్వారా రూపొందించబడింది. పోర్టల్ ద్వారా ఉద్యోగాల కోసం ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు, అలాగే ఇంటర్వ్యూలకు అప్లై చేయవచ్చు.
NCS.GOV.IN Work From Home Jobs పోర్టల్ ముఖ్య ఉద్దేశ్యాలు:
- పూర్తి ఉద్యోగ సమాచారం – ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలను కనుకొనడం ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం
- నైపుణ్య అభివృద్ధి – వివిధ కోర్సులు, శిక్షణ అవకాశాలను ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు.
- కెరీర్ గైడెన్స్ – ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, మార్కెట్ ట్రెండ్స్ సమాచారం ఇలా చాలా విషయాలు పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
- ఉచితంగా ఉపయోగించుకోవచ్చు – భారతదేశపు అన్ని ప్రాంతాల వారు చక్కగా ఉపయోగించుకునేలా భారత ప్రభుత్వం ఉచితంగా NCS పోర్టల్ ని రూపొందించడం జరిగింది
NCS పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు:
ఈ పోర్టల్‌లో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలలోని వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి. కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు:
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు – బ్యాంక్, రైల్వే, SSC, UPSC, డిఫెన్స్ లాంటి ఉద్యోగాలు.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు – వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి.
- ప్రైవేట్ ఉద్యోగాలు – MNC కంపెనీలు, BPO, IT కంపెనీల ఉద్యోగాలు చూడవచ్చు.
- వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్‌లు & ట్రైనింగ్ అవకాశాలు – స్టూడెంట్స్ కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఈ పోర్టల్ లో అందజేస్తున్నారు.
NCS.GOV.IN Work From Home Jobs | NCS పోర్టల్ యొక్క రిజిస్ట్రేషన్ విధానం:
ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడానికి
1.ముందుగా ఆధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి: https://www.ncs.gov.in
2.తర్వాత Register as a Job Seeker ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
3.మీ వివరాలు నమోదు చేయాలి: పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్, విద్యార్హతల వివరాలు
4.OTP వెరిఫికేషన్ ద్వారా ఖాతా క్రియేట్ చేయాలి.
5.లాగిన్ చేసి ప్రొఫైల్ పూర్తి చేయాలి.
ముఖ్యమైన తేదీలు | NCS.GOV.IN Work From Home Jobs For Students
NCS పోర్టల్‌లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు తరచుగా విడుదలవుతాయి. ఉద్యోగాల అప్లికేషన్ చివరి తేదీలు, ఇంటర్వ్యూలు మొదలైన తేదీలు ప్రతి నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ప్రకటించబడతాయి.
ఉద్యోగం | అర్హతలు | జీతం (అంచనా) |
బ్యాంక్ క్లర్క్ | డిగ్రీ పూర్తి | ₹25,000 – ₹40,000 |
రైల్వే ఉద్యోగాలు | 10th/12th/డిప్లోమా | ₹18,000 – ₹50,000 |
SSC ఉద్యోగాలు | ఇంటర్/డిగ్రీ | ₹25,000 – ₹60,000 |
UPSC | డిగ్రీ | ₹50,000 – ₹1,00,000 |
IT ఉద్యోగాలు | B.Tech/MCA | ₹30,000 – ₹80,000 |
స్వయం ఉపాధి అవకాశాలు | 10th/12th/డిగ్రీ | ₹15,000 – ₹50,000 |
అప్లికేషన్ ఫీజు:
NCS.GOV.IN Work From Home Jobs For Students | NCS పోర్టల్‌లో మనం ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అయితే, కొన్ని ఉద్యోగాల కోసం మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
జనరల్ – ₹100 – ₹500
SC/ST/PWD – రాయితీ లేదా పూర్తిగా మినహాయింపు
వయసు & సడలింపులు:
జనరల్ – 18 నుండి 40 ఏళ్లు
OBC – 3 ఏళ్ల సడలింపు
SC/ST – 5 ఏళ్ల సడలింపు
PWD – 10 ఏళ్ల సడలింపు
అవసరమైన నైపుణ్యాలు
- కమ్యూనికేషన్ స్కిల్స్
- కంప్యూటర్ నాలెడ్జ్
- టైప్‌రైటింగ్
- లీడర్‌షిప్ & మేనేజ్‌మెంట్ స్కిల్స్
విధులు మరియు బాధ్యతలు:
- ప్రతి ఉద్యోగానికి ప్రత్యేకమైన బాధ్యతలు తప్పనిసరిగా ఉంటాయి. ఉదాహరణకు, బ్యాంక్ ఉద్యోగుల్లో ఖాతాదారుల సేవలు, లావాదేవీలు నిర్వహించడం.
శిక్షణ సమయం:
- కొన్ని ఉద్యోగాల్లో ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ శిక్షణ కాలం ఆరు నెలలు నుంచి ఏడాది వరకు ఉంటుంది.
ఎంపిక విధానం
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఉద్యోగ స్థలం | NCS.GOV.IN Work From Home Jobs For Students
- NCS పోర్టల్ ద్వారా ఎంపికైన ఉద్యోగం మరియు స్థలం పూర్తిగా ఉద్యోగ రకంపై ఆధారపడి ఉంటుంది. మరికొందరికి వేరే చోట ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు
ఉద్యోగ రకం
- కాంట్రాక్ట్
- పెర్మనెంట్
- పార్ట్ టైమ్
- ఫుల్ టైమ్
కావలసిన డాక్యుమెంట్లు | NCS.GOV.IN Work From Home Jobs For Students
- విద్యార్హత సర్టిఫికేట్లు
- ఆదార్ కార్డ్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- కేటగిరీ సర్టిఫికేట్ (SC/ST/OBC)
సిలబస్ & ఎగ్జామ్ ప్యాటర్న్
- ప్రతి ఉద్యోగ పరీక్షకు సిలబస్ అనేది తప్పనిసరిగా వేరు ఉంటుంది. SSC, UPSC వంటి పోటీ పరీక్షలకు జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లిష్ సబ్జెక్టులు ఉంటాయి.
ఎగ్జామ్ సెంటర్స్ & హాల్ టికెట్
పరీక్షా కేంద్రాల యొక్క వివరాలు నోటిఫికేషన్‌లో ఇవ్వబడతాయి.
హాల్ టికెట్ పరీక్షకు ఒక వారం ముందుగా విడుదల కావడం జరుగుతుంది.
మునుపటి కటాఫ్ మార్కులు & వెయిటేజ్
- ప్రతీ నోటిఫికేషన్‌కు,ప్రతి జాబ్ కు కటాఫ్ మార్కులు వేరుగా ఉంటాయి. గత సంవత్సరాల కటాఫ్ మార్కులు తెలుసుకుని ప్రిపరేషన్ చేయాలి.
Previous Year Question Papers
SSC, UPSC, బ్యాంక్ పరీక్షల మునుపటి ప్రశ్నపత్రాలు NCS వెబ్‌సైట్ లేదా ఇతర పోటీ పరీక్ష వెబ్‌సైట్లలో లభిస్తాయి.
FAQs:
Q. ఈ పోర్టల్‌లో ఏ వయస్సు వారు అప్లై చేయొచ్చు?
A. 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు NCS పోర్టల్‌లో అప్లై చేయొచ్చు
Q. అప్లికేషన్‌లో తప్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చా?
A. అవును, అప్లికేషన్ కరెక్షన్ విండో సమయంలో తప్పులను కరెక్ట్ గా మార్చి పెట్టవచ్చు.
Q. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చా?
A. అవును, దేశవ్యాప్తంగా అందరూ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు
Q. EWS సర్టిఫికేట్ అవసరమా?
A. కొన్ని ఉద్యోగాల్లో EWS అవసరం.
END
- NCS పోర్టల్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను అందించే గొప్ప వేదిక. ఈ పోర్టల్ ద్వారా మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేయవచ్చు.
- ఆధికారిక వెబ్‌సైట్: https://www.ncs.gov.in