రబీ లో రైతులు కొత్తగా భూ రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు రైతుబంధు సహాయం కోసం ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదు

ఒక్క నిర్మల్ జిల్లాలోనే కొనుగోలు నుండి వారసత్వం గాను జూన్ 20 తరువాత అనేక కారణాలతో భూ బదలాయింపు చేసుకొని డిజిటల్ సంతకం

మరియు పాస్ బుక్కులు పొందిన రైతులు 2400 మంది ఉన్నారు

రైతుబంధు సహాయం కోసం సంబంధిత క్లస్టర్లో దరఖాస్తు చేసుకున్న కూడా ప్రభుత్వం మాత్రం పోర్టల్ అందుబాటులో ఉంచకపోడంతో

వీళ్లు రైతుబంధు సాయానికి దూరంగా ఉన్నారు. వాన కాలంలో రైతుబంధు సాయం చేయడానికి సమయం దగ్గరపడుతోంది

రెండు విడతలు కలిపి వానాకాలంలో ఒకేసారి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి ఐన అంజిప్రసాద్ ను వివరణ అడిగితే

కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్కునే రైతులకి రబీ లో రైతుబంధు సహాయం కోసం పైసలు అందని మాట నిజమే

కానీ జిల్లాలో 2400 మంది ఉన్నారు ఈ రబీ రైతుబంధు సాయం సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది

కాబట్టి రబీ రైతుబంధు సాయం అందచేసే వివరణ మాత్రం ప్రభుత్వ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది అని తెలియచేసారు