ఉద్యోగం గురించి: ప్రస్తుతకాలంలో ఇంటి నుంచే ఉద్యోగాలు చేయాలనుకునే వారు ఎక్కువైపోయారు. దీనికోసం ప్రభుత్వం ద్వారా శిక్షణతో ఇంటి నుంచే ఉద్యోగం కల్పిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు, విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం అందుబాటులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో IT, ITES రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తో సహా Work From Home Jobs ను అందిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో ఇంటి వద్ద నుంచే పని చేయడానికి అవకాశం ఉంటుంది మరియు నెలకు మంచి జీతం పొందొచ్చు.
సర్వే ఫామ్ లో మీరు సమాధానం ఇచ్చే ముఖ్యమైన వివరాలు:
- పేరు, విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు.
- ప్రస్తుత ఉద్యోగం (IT / Non-IT).
- వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మీకు ఆసక్తి ఉందా లేదా?.
- ముందు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుభవం ఉందా లేదా.
- ఇంట్లో ల్యాప్‌టాప్, మొబైల్, ఇంటర్నెట్, స్పీడ్ వివరాలు ఇవ్వాలి.
- వర్క్‌కి ప్రత్యేకమైన గది ఉందా లేదా.అంటే సెపరేట్ రూమ్.
- ట్రైనింగ్ నిర్వహించడానికి సరిపడా స్థలం ఉందా లేదా?.
- మీ ఇంట్లో ఎవరైనా వర్క్ చేయడానికి గది / స్పేస్ ఉందా లేదా?.
ముఖ్యమైన పాయింట్స్:
- ప్రభుత్వం ద్వారా శిక్షణతో ఈ ఉద్యోగాలతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం.
- అలాగే ఇంటి వద్ద నుంచే ఆదాయం పొందే అవకాశం.
- టెక్నికల్ నైపుణ్యాలు పెరుగుతాయి.
- భవిష్యత్తులో మంచి కెరీర్‌కు బేస్ అవుతుంది.
- ఎక్కువ మంది ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక వర్క్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశముంది.
అర్హతలు & జీతాలు
- అర్హతలు: (అంచనా మాత్రమే , కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు)
- వయస్సు: 18 నుంచి 50 ఏళ్లు. ( 50 ఏళ్లు నిండిన వారికి కూడా ఇది గొప్ప అవకాశం)
- విద్యార్హత: కనీసం 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ.
- మొబైల్ లేదా కంప్యూటర్ ఉండాలి.
- ఇంటర్నెట్ తప్పనిసరి
- జీతాలు:
- నెలకు ₹10,000 నుంచి ₹20,000 వరకు (పని మీద ఆధారపడి మారవచ్చు).
వర్క్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? (అంచనా మాత్రమే , కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు)
- మొదటగా సర్వేలో పాల్గొనాలి.
- అర్హత ఉన్నవారికి ఉచిత శిక్షణ అందిస్తారు.
- శిక్షణ తర్వాత ఉద్యోగంలో చేరవచ్చు.
ఈ వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్స్: (అంచనా మాత్రమే , కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు)
- బేసిక్ కంప్యూటర్ స్కిల్ ఉండాలి
- మంచి టైపింగ్ స్పీడ్.
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంటర్నెట్ వినియోగంలో అవగాహన ఉండాలి.
ఈ వర్క్ లో చేయవలసిన ముఖ్యమైన పనులు:( అంచనా మాత్రమే ఇంకా అఫిసియల్ గా చెప్పలేదు)
- డేటా ఎంట్రీ (అంటే IT రిలేటెడ్ పనులు చేయడం).
- బ్యాక్ ఆఫీస్ వర్క్ లాంటివి చేయడం.
- కస్టమర్ సపోర్ట్ అంతగా ఉండకపోవచ్చు ఇది ఒక అంచనా మాత్రమే దయచేసి మీ ఊరిలో అడికారులని అడిగి ఫైనల్ నిర్ణయానికి రాగలరు.
- ఇమెయిల్, చాట్ ద్వారా సహాయం.
ట్రైనింగ్ ( ప్రభుత్వం ద్వారా శిక్షణతో ) :
అర్హత ఉన్నవారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఇందులో:
- టెక్నికల్ విషయాలు నెర్చుంటారు .
- వర్క్ గురించి ప్రాక్టికల్ టిప్స్.
ఎంపిక ప్రక్రియ/ Selection ప్రాసెస్ :
- ముందుగా మీ ఊరిలో జరిగే సర్వేలో రిజిస్టర్ అవ్వాలి.
- నమోదు చేసుకున్న తరువాత అర్హత ఉంటే, ఉచితంగా శిక్షణ ఇస్తారు.
- శిక్షణ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవుతారు
వర్క్ చేయడానికి మీ ఇంట్లో అవసరమైనవి:
- మొబైల్ లేదా కంప్యూటర్ ఉండాలి.
- మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే తప్పనిసరిగా ఉండాలి.
ఇంకా దీని గురించి పూర్తి సమాచారం కావాలి ఆంటే చూడండి
- ఈ సర్వేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖ నిర్వహిస్తోంది
- మీ గ్రామ సచివాలయం లేదా
- వార్డు సచివాలయంగ్రామ/ మున్సిపల్ కార్యాలయం లో కాని
- లేదా స్థానిక ప్రభుత్వ అధికారుల దగ్గర లేదా
- మీ పంచాయితీ కార్యదర్శి, గ్రామవాలంటీర్, సచివాలయ ఉద్యోగులని అడిగి పూర్తి సమాచారం కనుక్కోవచ్చు.
FAQs
ఈ వర్క్ ద్వారా నిజంగానే జీతాలు వస్తాయా?
అవును, ఎంపిక అయితే రెగ్యులర్ జీతం వస్తుంది.
నెలకు ఎంత జీతం రావొచ్చు?
₹10,000 – ₹20,000 వరకు.
ఇంట్లో ఉన్న ఆడవారికి ఈ ఉద్యోగం ఎలా ఉంటుంది?
అద్భుతంగా ఉంటుంది, ఇంటి పనులతో పాటు సౌకర్యంగా చేయొచ్చు.
మొబైల్ ఉన్నవారికి ఈ ఉద్యోగం సాధ్యమేనా?
సాధ్యమే కానీ, కంప్యూటర్ ఉంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది.
ఈ ఉద్యోగానికి ఇంటర్నెట్ తప్పనిసరా?
అవును.
ఏ వయస్సు వారు చేయొచ్చు?
18 నుంచి 50 ఏళ్లు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు చేయొచ్చా?
లేదు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే, తెలంగాణ వారు దీనికి అర్హులు కారు.
స్టూడెంట్స్ చేయొచ్చా?
అవును, చదువుతో పాటు టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటే ఈ ఉద్యోగం చేసుకోవచ్చు.
దీని గురించి పూర్తి సమాచారం ఎక్కడ చూడాలి?
మీ పంచాయితీ కార్యదర్శి, గ్రామవాలంటీర్, సచివాలయ ఉద్యోగులని అడిగి పూర్తి సమాచారం కనుక్కోవచ్చు.
File size